: మా అన్నయ్య నుంచి కాంప్లిమెంట్ రావడం చాలా కష్టం: నటి సోనియా


తన నటనపై తన అన్నయ్య నుంచి కాంప్లిమెంట్ రావడం చాలా కష్టమని ‘హ్యాపిడేస్’ నటి సోనియా చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన అన్నయ్య మంచి క్రిటిక్ అని, తాను నటించిన చిత్రాల్లో నటన ఇలా ఉంటే బాగుండేదని, ఫలానా విధంగా చేస్తే బాగుండేదని సూచనలు ఇస్తుంటాడని చెప్పింది. తన అన్నయ్య వృత్తి రీత్యా జియోలజిస్ట్ అని, తమ కుటుంబంలో లాయర్లు, శాస్త్రవేత్తలు..ఇలా చాలా మంది ఉన్నారని.. తమది ఉమ్మడి కుటుంబం అని పేర్కొంది.

నటనా రంగంలోకి వచ్చిన తనకు తన కుటుంబ సభ్యుల మద్దతు పుష్కలంగా ఉందని చెప్పింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కాగా, సోనియా తాజాగా 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’ సినిమాలో నటించింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నేలంటి దర్శకత్వం వహించారు. 

  • Loading...

More Telugu News