: అటవీశాఖాధికారులపై తమిళ కూలీల రాళ్ల దాడి!


చిత్తూరు జిల్లాలో అటవీ శాఖాధికారులపై కూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. చంద్రగిరి మండలం శేషాచలం, ఏనుమగుల మడుగు వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కు వచ్చిన 20 మంది తమిళ కూలీలు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనపడ్డారు. ఈ క్రమంలో అటవీ శాఖాధికారులపై రాళ్ల దాడి చేశారు. దీంతో, అటవీశాఖాధికారులు గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఐదుగురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News