: విశాఖ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు!
విశాఖపట్టణం జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చింతపల్లి మండలంలోని అన్నవరం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.