: డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కిన ఘటన చామరాజ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలో చామరాజ్ నగర్ జిల్లాలో ఒక నియోజవర్గానికి అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఒక కుటుంబానికి సుమారు లక్ష రూపాయలను 2000 నోట్ల రూపంలో అందజేస్తూ కెమెరాకు చిక్కారు. దీనిపై యడ్యూరప్ప మాట్లాడుతూ, కొద్దిరోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి మానవతా దృక్పథంతోనే సాయం చేశానని అన్నారు. అది కూడా పార్టీ నిధి నుంచే ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయగా, కాంగ్రెస్ పై కూడా బీజేపీ ఫిర్యాదు చేసింది. 

  • Loading...

More Telugu News