: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కోట్ల ధనప్రవాహం... ఎన్నికలు నిలిచిపోతాయా?
తమిళనాడులోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో కోట్లాది రూపాయల ధనప్రవాహాన్ని జాతీయ ఎన్నికల సంఘం గుర్తించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదిక సమర్పించగా, ఐటీ శాఖ కూడా నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళనాడు మంత్రి నివాసం నుంచి ఆర్కెనగర్ కు వెళ్లిన వంద కోట్ల రూపాయలు ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పంపణీకి వెళ్లినట్టు గుర్తించారు. ఈ డబ్బులో 89 కోట్ల రూపాయలు పంపిణీ జరిగినట్టు గుర్తించారు. 2 లక్షల మంది ఓటర్లకు ఓటుకు సుమారు నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసినట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మొత్తాన్ని శశికళ వర్గానికి చెందిన దినకరన్ విజయం సాధించేందుకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇతర పార్టీలు కూడా భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఈ నెల 12న ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.