: మళ్లీ ప్రేమలో పడ్డ బాలీవుడ్ భామ!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా మళ్లీ ప్రేమలో పడింది. గతంలో దర్శకుడు మనీష్ శర్మతో ఆమె డేటింగ్ చేసింది. ఆ సమయంలో మనీష్ దర్శకత్వం వహించిన 'లేడీస్ వర్సెస్ రికీ బల్', 'శుద్ధ దేశీ రొమాన్స్' సినిమాల్లో పరిణీత తళుక్కుమంది. ఆ తర్వాత వీరి ప్రేమ బ్రేకప్ అయింది. ఇప్పుడు మరోసారి పరిణీత ప్రేమలో పడిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో ఈమె డేటింగ్ చేస్తోందని ఫిలింఫేర్ మేగజీన్ ప్రచురించింది. వీరిద్దరూ రహస్యంగా తిరుగుతున్నారని... అయితే తమ అఫైర్ బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తన కథనంలో పేర్కొంది.