: పూణేను సమర్థవంతంగా కట్టడి చేస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ఐపీఎల్ సీజన్ 10లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో ఒకటిగా నిలిచిన పూణే సూపర్ జెయింట్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బౌలర్లు సమర్థవంతంగా నిలువరించారు. మయాంఖ్ అగర్వాల్ (0) ను ఖాతా తెరవకుండానే తొలి ఓవర్ లో సందీప్ శర్మ అద్భుతమైన బంతితో పెవిలియన్ కు పంపాడు. అనంతరం రెండు పరుగుల వద్ద రహానే (19)కు లైఫ్ ఇచ్చిన నటరాజన్ అవుట్ చేశాడు. మానన్ వోహ్రా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కెప్టెన్ స్మిత్ (26) పెవిలియిన్ చేరాడు. దీంతో ఈ సీజన్ లో ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్ (5) కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (1) జతకలిశాడు. 9 ఓవర్లు ముగిసేసరికి పూణే సూపర్ జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, నటరాజన్, స్టోయిన్స్ చెరొక వికెట్ తీశారు.