: నేను ఎంత సున్నితంగా ఉంటానో... అంతే కఠినంగా కూడా ఉంటా: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే మంత్రివర్గాన్ని విస్తరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీలు ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ గగ్గోలు పెడుతున్న పార్టీలు... గతంలో ఫిరాయింపులు చేయలేదా అని ప్రశ్నించారు. కేసుల విచారణలో సీబీఐని ఇతరులు ప్రభావితం చేస్తున్నారంటూ విమర్శిస్తున్న జగన్... అగ్రిగోల్డ్ కేసులో సీబీఐ విచారణ కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. తాను ఎంత సున్నితంగా ఉంటానో... అంతే కఠినంగా కూడా ఉంటానని చెప్పారు. ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను టూరిజం, ఐటీ, లాజిస్టిక్ హబ్ గా మారుస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News