: భారత్-బంగ్లాదేశ్ ల మధ్య కుదిరిన 22 కీలక ఒప్పందాలు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని హసీనాల సమక్షంలో కీలకమైన 22 ఒప్పందాలు జరిగాయి. వీటిలో అణు ఇంధనం, రక్షణతో పాటు పలు ఒప్పందాలు ఉన్నాయి. అనంతరం ఇరువురు ప్రధానులు కలసి సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒప్పందాలను కుదుర్చుకున్నామని తెలిపారు. న్యాయ సహకారంపై కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఉగ్రవాదం, భద్రతా సహకారంపై తాము చర్చించామని చెప్పారు. భారత్ కు బాంగ్లాదేశ్ ఎంతో కాలంగా మంచి మిత్రుడని అన్నారు.