: అభిమాన సంఘాలతో అత్యవసర సమావేశాలను రద్దు చేసుకున్న రజనీకాంత్
అభిమాన సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు వివిధ జిల్లాల అభిమానులను తనతో సమావేశానికి ఆయన పిలువగా, రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చేందుకే ఆయన సమావేశాలు ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీటిని రద్దు చేస్తున్నట్టు రజనీకాంత్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ప్రతి అభిమానితో ఫోటోలు దిగడం సాధ్యం కాదని రజనీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అందరినీ సంతృప్తపరచలేమన్న ఉద్దేశంతోనే సమావేశం రద్దు చేస్తున్నామని, భవిష్యత్తులో మరోసారి ఇదే తరహా మీటింగ్ పెట్టుకుందామని రజనీ చెప్పారని ఈ ప్రకటనలో ఉంది.