: హత్య చేసినట్టు ఒప్పుకోకపోతే చంపేస్తామని పోలీసులు బెదిరించారు.. నరకయాతనకు గురి చేశారు: సత్యంబాబు


ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను హత్య చేసినట్టు ఒప్పుకోవాలని... లేకపోతే, చంపేస్తామంటూ పోలీసులు తనను వేధించారని ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు తెలిపాడు. తనతో పాటు తన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించారని చెప్పాడు. 8 సంవత్సరాల పాటు జైల్లో తనను పోలీసులు నరకయాతనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాస్తవానికి ఆయేషాను తాను ఎన్నడూ చూడనేలేదని చెప్పాడు. అన్యాయంగా తనను కేసులో ఇరికించారని వాపోయాడు. ఆయేషాను హత్య చేశానని తాను ఒప్పుకున్నట్టు విడుదలైన సీడీ కూడా పోలీసుల సృష్టేనని తెలిపాడు. హైకోర్టు తీర్పుతో తాను నిర్దోషిననే విషయం అందరికీ అర్థమయిందని అన్నాడు. తన భవిష్యత్తు ఏమిటనేది ఇంకా నిర్ణయించుకోలేదని సత్యంబాబు చెప్పాడు.

  • Loading...

More Telugu News