: విశాఖలో రన్ వేపై మూడు గంటలుగా నిలిచిన విమానం... తెరచుకోని తలుపులతో ఎమ్మెల్యేలు, ప్రముఖులకు ఇబ్బంది


ఈ ఉదయం విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం, సాంకేతిక లోపం కారణంగా మూడు గంటలుగా నిలిచిపోయింది. విమానంలో ఏసీ పనిచేయక పోవడం అందులోని ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. విమానంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు కూడా ఉన్నారు. కిందకు దిగుదామంటే, తలుపులు లాక్ అయిపోయాయి. దీంతో దిగే అవకాశం లేక, ఊపిరి ఆడని పరిస్థితుల్లో పలువురు సీనియర్లు బాధపడుతున్నారని తెలుస్తోంది. బయట 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, తలుపులు వేసి, ఏసీ పనిచేయని పరిస్థితుల్లో విమానంలో ఎలా ఉంటుందో తెలిసిందే. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని, అసలేం జరిగిందో కూడా అధికారులు తెలియజేయలేదని, కనీసం తలుపులు తీసి వెంటనే తమను కిందకు దింపాలని డిమాండ్ చేస్తూ, విమానంలోని పలువురు టీవీ చానళ్లకు ఫోన్ చేసి చెబుతున్న పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News