: డీఎండీకే నేత దారుణ హత్య!
డీఎండీకే ప్రిసీడియం ఛైర్మన్ శరవణన్ (34) దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని చెంగల్వరాయని వీధిలో ఉన్న ఆయన ఇంటి ముందు ఆయనను దారుణంగా హత్య చేశారు. రాత్రి 10 గంటలకు తన ఇంటి ముందు నిలబడి ఫోన్ లో మాట్లాడుతుండగా, గుర్తు తెలియని దుండగులు అతనిపై మారణాయుధాలతో దాడి చేసి, దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్య చేసిన వెంటనే, దుండగులు పారిపోయారు. మృతుడు శరవణన్ రియలెస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. హత్య నేపథ్యంలో, తమిళనాడులోని పలు జిల్లాల్లో డీఎండీకే కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.