: వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఢిల్లీ మోడల్
వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్ పై పోలీసులు దాడి చేశారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ మోడల్ (24) హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ ను, కృష్ణా నగర్ కు చెందిన ఆమె సహాయకుడు నర్సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 వేల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.