: ప్రతిపక్షాల విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకే సంస్థను మూసేస్తున్నాం!: మీడియాతో కేశినేని నాని


రాజకీయాల్లో ఉంటూ ట్రావెల్స్ నిర్వహిస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు విమర్శిస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకే తాను సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, 170 బస్సులను అమ్మకానికి పెట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను ట్రావెల్స్ మూసివేత వద్దని వారించారని, అయినా తాను ఈ వ్యాపారంలో కొనసాగేందుకు ఇష్టపడలేదని తెలిపారు. అక్రమ పద్ధతుల్లో బస్సులను నడుపుతూ తానేనాడూ లాభాలను ఆర్జించలేదని తెలిపారు. ఇంతకాలం తనను నమ్మి, తన వెన్నంటి ఉన్న సంస్థ ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News