: కమలహాసన్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. క్షేమంగా బయటపడ్డ విలక్షణ నటుడు
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ భారీ అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నిన్న రాత్రి ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మూడవ అంతస్తులో ఉన్న కమల్ అక్కడ నుంచి కిందకు చేరుకుని, క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఊపిరితిత్తులు పూర్తిగా పొగతో నిండిపోయాయని చెప్పారు. ఇటీవలే ఓ ప్రమాదంలో కమల్ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన ఒక సంవత్సర కాలం పాటు షూటింగ్ కు దూరంగా ఉన్నారు.