: మంత్రి పదవి కావాలని నేనెప్పుడూ అడగలేదు.. బాబే ఆ అవకాశం కల్పించారు: పితాని
మంత్రి పదవి కావాలని తానెప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అడగలేదని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబే స్వయంగా నిర్ణయించి తనకు కేబినెట్లో చోటు కల్పించారని అన్నారు. మంత్రి హోదాలో శుక్రవారం తొలిసారి ఏలూరు వచ్చిన పితాని ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విప్ ప్రభాకర్ హాజరవుతారని భావించినా ఆయన రాలేదు. దీంతో ఆయన రాక కోసం రెండున్నర గంటల పాటు మంత్రి గెస్ట్‌హౌస్‌లోనే గడిపారు. ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రభాకర్‌ను మంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్పందించిన పితాని తనకు భేషజాలు లేవని, తానే స్వయంగా ప్రభాకర్‌ను కలుస్తానని తెలిపారు. పార్టీ పరంగా అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి పితాని పేర్కొన్నారు.