: 'కేశినేని ట్రావెల్స్' అనూహ్య నిర్ణయం.. సంస్థ మూసివేత.. నష్టాలే కారణమన్న యాజమాన్యం!
కేశినేని ట్రావెల్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నష్టాల కారణంగా సంస్థను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సంస్థకు చెందిన సగానికి పైగా బస్సులను ఇప్పటికే విక్రయించిన యాజమాన్యం సంస్థను మూసివేస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో ఆ సంస్థ కార్యాలయం వద్ద ‘కేశినేని ట్రావెల్స్’ అని ఉన్న బోర్డును శనివారం సిబ్బంది తొలగించారు. ఇటీవల చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్టు టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో ఈ విషయంలో పునరాలోచించాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అంతలోనే సంస్థను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడం సంచలనం సృష్టించింది. కాగా, ఇటీవల ఆర్టీఏ అధికారిపై నాని దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.