: సోనమ్ కపూర్, అక్షయ్ కుమార్.. ఇలా షాక్ అయ్యారు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, సోనమ్ కపూర్ లకు జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తమ్’, సోనమ్ నటించిన ‘నీర్జా’ సినిమాల్లో పోషించిన పాత్రలకు ఈ అవార్డులు దక్కాయి. దీంతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ‘ప్యాడ్ మ్యాన్’ షూటింగ్ లో ఉన్న సోనమ్, అక్షయ్ తమకు వచ్చిన పురస్కారం పట్ల స్పందించారు. ఆనందం వ్యక్తం చేసిన వీరిద్దరూ కలసి ఓ ఫోటో దిగారు. దానిని సోనమ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ, ‘ఎవరు వూహిస్తారు అవార్డులు వరిస్తాయని... షాకింగ్ గా, గర్వంగా ఉంది’ అని పేర్కొంది. ఈ ఫోటోను వారి అభిమానులు వైరల్ చేస్తున్నారు.