: పెద్దాయన వచ్చాకే వేదిక ఎక్కుతా.. ఆయన వచ్చాకే మాట్లాడతా: నటుడు పృథ్వీరాజు


పెద్దాయన (మెగాస్టార్) వచ్చాకే స్టేజ్ పైకి ఎక్కుతానని, ఆయన వచ్చాకే మాట్లాడతానని ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజు అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అందరికన్నా ముందు వచ్చిన అతిథి పృథ్వీరాజును ఆహ్వానిస్తున్నామని, నాలుగు ముక్కలు మాట్లాడాల్సిందని వ్యాఖ్యాత కోరగా, అందుకు, పృథ్వీరాజు పై విధంగా స్పందించారు.

‘విచ్చేసిన మెగా అభిమానులందరికీ ... పెద్దాయన విచ్చేసిన తర్వాత వేదిక ఎక్కితే ఓ అర్థం. ఆయన వచ్చాక మాట్లాడదాం. థ్యాంక్యూ’ అని పృథ్వీరాజు అన్నాడు. కాగా, ఈ కార్యక్రమానికి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీను వైట్ల, ‘మిస్టర్’ హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, వరుణ్ తేజ్ సోదరి నీహారిక తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News