: అమరావతిలో శాశ్వత నివాసం కోసం చంద్రబాబు ప్రయత్నాలు!
ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పరచుకునే ప్రయత్నాల్లో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాస్తు రీత్యా అనువైన స్థలం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై వాస్తు పండితులను సంప్రదిస్తున్నారని, నదికి అభిముఖంగా ఉండే స్థలమా? లేక వేరే ప్రాంతంలో స్థలం కొనుగోలు చేయాలా? అనే విషయమై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. యువమంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇప్పటికే వాస్తు పండితులతో మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. కాగా, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని, ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.