: సిరియాపై దాడితో.. అమెరికా కొత్త డ్రామాకు తెరతీసింది: పుతిన్
సిరియాలోని అల్ బషర్ వైమానిక స్థావరంపై అమెరికా విరుచుకుపడడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలను అమెరికా తుంగలో తొక్కుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అమెరికా దుశ్చర్య కారణంగా అమెరికా-రష్యా మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. సిరియా వైమానిక స్థావరంపై అమెరికా క్రూయిజ్ మిసైల్ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. సిరియాపై అమెరికా చేపట్టిన చర్యను సార్వభౌమాధికార దేశంపై అమెరికా చేసిన దాడి అని పుతిన్ పేర్కొన్నారు. ఇరాక్ లో సామాన్య ప్రజల మరణాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్ళించేందుకు అమెరికా సిరియాపై దాడి చేసి కొత్త డ్రామాకు తెరతీసిందని ఆయన మండిపడ్డారు.