: జిల్లాలో వైఎస్సార్సీపీకి నిద్రలేకుండా చేస్తా: ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి
రానున్న రెండేళ్లు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తానని మంత్రి అమరనాథ్ రెడ్డి ప్రతినబూనారు. చిత్తూరు జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తానేమీ అనామకుడిగానో లేక సాధారణ కార్యకర్తగానో వైఎస్సార్సీపీలోకి వెళ్లలేదని ఆయన చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తినని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీలో ఇమడలేకే పార్టీ మారానని ఆయన చెప్పారు. జగన్ రాష్ట్రపతిని కలవడం హాస్యాస్పదమని ఆయన చెప్పారు. జిల్లా వైఎస్సార్సీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.