: ఏపీని ఆదుకునేది మేమే... భక్తరామదాసు ప్రాజెక్టు ఆపే పరిస్థితి లేదు: తెలంగాణ మంత్రి తుమ్మల


ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకునేది తామేనని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన భక్త రామదాసు పాజెక్టును పూర్తి చేసి తీరుతామని అన్నారు. తమకు రావాల్సిన నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టులో భాగమని ఆయన స్పష్టం చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టుపై ఎలాంటి అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా తాము ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News