: ఒకటి అండర్ డాగ్...మరొకటి మొదటి నుంచీ టైటిల్ ఫేవరేట్లలో ఒకటి


ఈ రాత్రికి ఐపీఎల్ లో తొలిసారి టీమిండియా ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్న జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కెప్టెన్లిద్దరూ ఆస్ట్రేలియన్లే... రాత్రి ఆడిన పూణే సూపర్ జెయింట్ కెప్టెన్ స్మిత్ కూడా ఆస్ట్రేలియన్...ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే భారతీయుడు. ఈ రాత్రి గుజరాత్ లయన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. గుజరాత్ లయన్స్ కు సురేష్ రైనా కెప్టెన్ కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

గుజరాత్ లయన్స్ జట్టు గత సీజన్ లో రంగప్రవేశం చేసింది. ఏమాత్రం అంచనాలు లేని స్థాయి నుంచి వరుస విజయాలతో ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరేట్ గా కొనసాగుతోంది. అయినప్పటికీ ఇప్పటి వరకు టైటిల్ ఆ జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు నేటి రాత్రి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ లయన్స్ జట్టు అండర్ డాగ్ గా బరిలో దిగనుండగా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మళ్లీ టైటిల్ సాధనకు బరిలో దిగుతోంది. రెండు జట్లు బ్యాటింగే బలంగా బరిలో దిగనున్నాయి. 

  • Loading...

More Telugu News