: ఆంధ్రప్రదేశ్ చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుంది!: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర తనను గుర్తుపెట్టుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసినన్ని ప్రాజెక్టులు ఏ రాష్ట్రానికి మంజూరు కాలేదని అన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ కు మేలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు అదనంగా 950 మెడికల్ సీట్లను కేటాయించామని ఆయన తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రానికి 2,500 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సోలార్‌ పార్కులు మంజూరు చేసిందని అన్నారు. రాజధాని నిర్మాణానికి 3 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేశామని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు 1.93 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News