: చంద్రబాబు సమక్షంలో ఆత్మహత్యాయత్నం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ నేత అర్షంస్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణలోని హన్మకొండలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహం ఈరోజు జరిగింది. ఈ వేడుకకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఆర్థిక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు అర్షంస్వామి ప్రయత్నించాడు. తన కష్టాలు చెప్పుకోవడానికి యత్నించాడు. అయితే, చంద్రబాబు వద్దకు వెళ్లనీయకుండా పలువురు అడ్డుకున్నారు. దీంతో, మనస్తాపానికి గురైన అర్షంస్వామి వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే, పక్కనున్నవారు వెంటనే అతన్ని అడ్డుకుని... దారుణం చోటు చేసుకోకుండా వ్యవహరించారు. అతన్ని అక్కడ నుంచి తీసుకెళ్లారు.