: ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు రూ. 50 వేలు జరిమానా విధించిన సుప్రీంకోర్టు
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు చైర్ పర్సన్, ఇతర సభ్యులను నియమించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలపై రూ. 50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ రాష్ట్రాల్లో 4 వారాల్లోగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులను నియమించాలని, మూడు వారాల్లోగా జరిమానాను లీగల్ సర్వీసెస్ కమిటీకి అందించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర చట్టాలను అమలు చేయకుండా ఈ రాష్ట్రాలు నిబంధనలను ఉల్లంఘించాయని సంపూర్ణ బెహ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం అభిప్రాయపడింది.