: శివసేన ఎంపీని విమానం ఎక్కించే ప్రసక్తే లేదు: ఎయిరిండియా కేబిన్ క్రూ అసోసియేషన్


శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానం ఎక్కాలంటే క్షమాపణ చెప్పాల్సిందేనని... అంతవరకు ఆయనను విమానం ఎక్కించే ప్రసక్తే లేదని ఎయిరిండియా కేబిన్ క్రూ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహానీకి లేఖ రాసింది. గైక్వాడ్ పై నిషేధం ఎత్తివేయాలని పార్లమెంటు కానీ, పౌర విమానయాన శాఖ కానీ నిర్ణయం తీసుకుంటే... అది ఎయిరిండియా సిబ్బంది ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఈ ఎంపీతో మొత్తం విమాన భద్రతకే ముప్పు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

 

  • Loading...

More Telugu News