: ఆ ఇంటర్వ్యూలో నా ప్రస్తావన ఎక్కడా లేదు.. పిటిషన్ ను కొట్టేయండి: జగన్
సాక్షి మీడియాలో మాజీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో ఈ రోజు జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులతో జరిపిన సంభాషణలను మాత్రమే రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో తెలిపారని తన కౌంటర్ లో జగన్ పేర్కొన్నారు. కేసు గురించి కానీ, తన గురించి కానీ ఆయన ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, తన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును జగన్ అభ్యర్థించారు. ఈ క్రమంలో, తదుపరి విచారణను 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.