: జగన్ కేసులో కోర్టుకు హాజరైన సబితా ఇంద్రారెడ్డి
వైపీసీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్యలు ఈ రోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీరందరి సహకారంతో జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనేది వీరిపై ఉన్న అభియోగం. మరోవైపు, జగన్ బెయిల్ ను రద్దు చేయాలనే పిటిషన్ పై కూడా నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి, జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.