: పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ పోలీసులను కంగారు పెట్టించిన తిరువూరు ఏసీటీఓ పద్మ


తిరువూరులో ఓ సిమెంట్ దుకాణానికి తనిఖీలంటూ వెళ్లి హల్ చేసిన ఏసీటీఓ పద్మ, తన వైఖరితో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి కంగారు పుట్టించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, తన మానసిక స్థితి సరిగా లేదన్న విషయాన్ని అందరికీ చెప్పారు. "పిచ్చిపిచ్చిగా ఉందా?" అంటూ తనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై ఆమె వాగ్వాదానికి దిగారు. వాళ్లను కూడా అరెస్ట్ చేయాల్సిందేనంటూ, అప్పటివరకూ కదలబోనని అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. "మీకు కళ్లేమైనా కనబడట్లేదా?... దొబ్బాయా కళ్లు... బీకామ్ లో ఫిజిక్స్... హేమమాలినీ నామ సంవత్సర శుభాకాంక్షలు రా మీకందరికీ" అంటూ హల్ చల్ చేశారు. ఆమె వ్యాఖ్యలతో కంగారుపడ్డ పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించి, తిరువూరులోనే ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News