: రైతులకు బాసటగా.. కీలక నిర్ణయం తీసుకున్న హీరో విశాల్.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న సినీ ప్రముఖులు


తమిళ సినీ నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా తెలుగువాడు, యంగ్ హీరో విశాల్ ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనతో పాటు నిర్మాతల మండలి కార్యవర్గం నిన్న సాయంత్రం ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమం చెన్నై కోడంబాక్కంలోని రజనీకాంత్ కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఒక కీలక నిర్ణయాన్ని మండలి తీసుకుంది. సినిమా టికెట్ ధరలో నిర్మాతల వంతుగా ఒక్క రూపాయి రైతులకు అందించాలని నిర్ణయించింది. తమిళనాడులో ప్రదర్శితమయ్యే ప్రతి ఒక్క సినిమాకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతి టికెట్ పై వసూలు చేసే ఒక్కో రూపాయిని రైతు సహాయ నిధికి కేటాయిస్తారు. ఇది ప్రారంభమయ్యే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని.. ఎన్ని కోట్లు వసూలైనా ఆ మొత్తాన్ని ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు ఇస్తామని విశాల్ ప్రకటించాడు. విశాల్ నాయకత్వంలోని నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు, తమిళ ప్రజలు, రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

  • Loading...

More Telugu News