: నేడు పీఠమెక్కనున్న నారా లోకేష్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 2న వెలగపూడిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయనకు శాఖలను కేటాయించగా, పురోహితుల సలహా మేరకు నేడు ముహూర్తం బాగుందన్న ఆలోచనతో నేడు అధికారికంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. వెలగపూడిలోని ఐదో బ్లాక్ కింది అంతస్తులో లోకేష్ కోసం చాంబరును సిద్ధం చేశారు. కాగా, అటవీ శాఖ మంత్రిగా శిద్ధా రాఘవరావు కూడా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు.