: జియో నుంచి మరో సంచలనం.. త్వరలో మార్కెట్లోకి జియో 4జి ల్యాప్‌టాప్!


జియో.. సంచలనాలకు ఇప్పుడిది కేరాఫ్ అడ్రస్. టెలికం రంగంలోకి అడుగుపెట్టి రోజుకో సంచలన ప్రకటనతో పోటీదారులను ముప్పుతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. అతి త్వరలో 4జీ సామర్థ్యం కలిగిన ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో సిమ్‌కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఉండడం విశేషం. యాపిల్ సంస్థకు చెందిన 13.3 అంగుళాల మ్యాక్‌బుక్‌ను ఇది పోలి ఉంటుందని సమాచారం.

ప్రత్యేకతలు:

పుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్‌లో వీడియో కాలింగ్ హెచ్‌డీ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బుల్ట్ మెమొరీ, మరో 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉన్నట్టు సమాచారం. అలాగే 4జీ, ఎల్‌టీఈ, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ పోర్టు సదుపాయంతోపాటు రెండు యూఎస్‌బీ పోర్ట్స్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంటాయని తెలుస్తోంది. ధర వివరాలు మాత్రం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News