: ఢిల్లీ వస్తే పాపాలు పోతాయనుకుంటాడు.. రాష్ట్రపతి కాఫీ ఇచ్చి పంపిస్తారు!: జగన్ ఢిల్లీ టూరుపై జేసీ విసుర్లు


జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ విమాన టికెట్లకు డబ్బులు వృథా చేసుకోవడం మాని రాంజెఠ్మనీలాంటి లాయర్లను పెట్టుకుని ఆ వైపు నుంచి పోరాడాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడి దర్శనానికి వెళ్లినట్టు, సమస్యలు వచ్చినప్పుడే జగన్ ఢిల్లీ వస్తాడని  విమర్శించారు. ఈడీ, సీబీఐ నుంచి తాఖీదులు రాగానే వెంటనే ఢిల్లీలో వాలిపోతాడని, ఇక్కడికొస్తే పాపాలు పోతాయని భావిస్తాడని తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని కలిసినంత మాత్రాన ఆయనేమీ చేయరని, కప్పు కాఫీ ఇచ్చి పరిశీలిస్తామని చెప్పి పంపిస్తారని అన్నారు. కాబట్టి విమాన టికెట్లకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా పేరుమోసిన రాంజెఠ్మలానీ లాంటి వాళ్లను పెట్టుకుని ఆ మార్గంలో వెళ్లాలని సూచించారు. వైఎస్ హయాంలోనూ ఫిరాయింపు చట్టం ఉందని, పిరాయింపుదారులు మంత్రులు కావడం మామూలేనని కొట్టిపడేశారు. ఇది కూడా ఒక సంప్రదాయం అయిపోయిందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News