: లోకేశ్ పప్పు అయితే అయ్యన్న ఎర్రిపప్పు..!: విశాఖ పాదయాత్రలో రోజా ఘాటు వ్యాఖ్యలు
విశాఖపట్టణానికి రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చేపట్టిన పాదయాత్రలో గురువారం పాల్గొన్న ఆ పార్టీ మహిళా నేత ఆర్కే రోజా టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త మంత్రి నారా లోకేశ్ పప్పు అయితే, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎర్రిపప్పు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నకు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు, గంజాయి సాగుపై ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై లేకపోవడం బాధాకరమన్నారు. బ్యాంకులకు రూ.200 కోట్లు ఎగ్గొట్టిన మంత్రి గంటా దాని నుంచి బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు హోదా, రైల్వేజోన్‌ను అటకెక్కించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.