: యుద్ధ ప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణకు చర్యలు: మంత్రి నారా లోకేష్


రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చెయ్యాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టనున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 21 మునిసిపాలిటీలలో నీటి ఎద్దడిని గుర్తించామని, వాటర్ ట్యాంకర్లకు జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల నీటి అవసరాలు తెలుసుకుంటామని లోకేష్ అన్నారు.

  • Loading...

More Telugu News