: ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేయడం తప్పుకాదు: జేసీ దివాకర్ రెడ్డి
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం తప్పుకాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాలానుగుణంగా పరిస్థితుల మారుతుంటాయని,ఈ విషయమై ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక పార్టీలో ఇమడలేని ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి మారడంలో ఎటువంటి తప్పులేదని, ఫిరాయింపు ఎమ్మెల్యేలను తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ జేసీ తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించీ ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అప్పటిలోగా పూర్తి చేయడం సాధ్యం కాదని, మరో నాలుగేళ్లు అదనంగా పడుతుందని అభిప్రాయపడ్డారు.