: బ్రిట్నీస్పియర్స్ షో ఉందని ఏకంగా ఎన్నికలు వాయిదా?


హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ షో ఉందని ఏకంగా ఎన్నికలు వాయిదా వేసిన ఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జూలై 3న ఇజ్రాయిల్ లోని ప్రధాన పార్టీల్లో ఒకటైన లేబర్ పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నికల షెడ్యుల్ కూడా ప్రకటించేశారు. దీంతో షెడ్యూల్ ప్రకారం అన్నీ జరగాల్సి ఉంది. ఇంతలో జూలై 3న మేజర్ ఈవెంట్ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని లేబర్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

దీంతో ఆ ఈవెంట్ ఏంటా? అని ఆరాతీసిన మీడియాకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆ రోజు పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ షో ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ లో జరగనుంది. దీంతో ఎన్నికలు వాయిదా వేశామని లేబర్ పార్టీ తెలిపింది. దీంతో ఆశ్చర్యపోయిన మీడియా ఆ వార్తను రాయడంతో లేబర్ పార్టీ వివరణ ఇస్తూ,  ‘బ్రిట్నీ తొలిసారిగా ఇజ్రాయిల్‌ లో ప్రదర్శన ఇస్తోంది. ఆ షోకు అభిమానులు ఎక్కువగా వస్తారు. దీంతో పార్టీ సభ్యులు పోలింగ్‌ స్టేషన్స్‌ కు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారనే ఉద్దేశంతోనే ఎన్నికలు వాయిదా వేశాం’ అని తెలిపింది. 

  • Loading...

More Telugu News