: ఏపీలో రేపటి నుంచి ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు’
రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏపీలో ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు’ ప్రారంభించనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో ఉన్న అర్బన్ సెంటర్ల స్థానే ఈ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిని సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 222 ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు’ ప్రారంభమవుతాయని.. ఈ కేంద్రాల్లో ఉచిత వైద్య సేవలతో పాటు, మందులు కూడా అందజేస్తారని తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యున్నత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా, రేపటి నుంచి ‘ఆరోగ్య రక్ష’ కేంద్రాలూ ప్రారంభం కానున్నాయని కామినేని తెలిపారు.