: దళిత ఎమ్మెల్యేననే నన్ను అవమానించారు..సీఎంకు ఫిర్యాదు చేస్తా: టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్


తాను దళిత ఎమ్మెల్యేననే తనను అవమానించారని తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని టీడీపీ కార్యాలయంలో గ్రామస్తులతో ఆయన ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, తనకు సమాచారం ఇవ్వకుండానే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మంత్రి నక్కా ఆనంద్ బాబు స్థల పరిశీలన చేశారని, ఉద్దేశపూర్వకంగానే అధికారులు తనను ఈ కార్యక్రమానికి పిలవలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించనని, సీఎంకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదన్న విషయం ఆనంద్ బాబుకు తెలియదని తాను అనుకుంటున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News