: ఈ నెల 10 లోపు ఎంపీ గైక్వాడ్‌పై ఉన్న నిషేధం అంశాన్ని పరిష్కరించాలి: శివ‌సేన


విమాన సిబ్బందితో దురుసుగా ప్ర‌వ‌ర్తించి, కొట్టినందుకుగానూ శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌పై విమానయాన సంస్థ‌లు నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. అయితే, త‌మ పార్టీ ఎంపీపై నిషేధం విధించ‌డం ప‌ట్ల శివ‌సేన ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈనెల 10 లోపు గైక్వాడ్‌పై ఉన్న నిషేధం అంశాన్ని పరిష్కరించకపోతే ఎన్‌డీఏ సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలిపారు. గైక్వాడ్‌ను లక్ష్యంగా చేసుకున్నార‌ని శివ‌సేన ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. విమానాల్లో రేపిస్టులు, ఉగ్రవాదులు, ప్రత్యేక కశ్మీర్‌ కోసం పోరాడే వారంతా తిరగవచ్చు కానీ, గైక్వాడ్ ఎక్క‌వ‌ద్దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని త‌మ‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News