: జగన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి: జేసీ
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసినంత మాత్రాన ఎలాంటి లాభం లేదని చెప్పారు. మరో రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి చేయడం ఖాయమని... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం గ్యారంటీ అని అన్నారు. దావూద్ ఇబ్రహీం, మధు కోడాల్లా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ తన ప్రవర్తనను ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు.