: మరో ఘనతను సాధించిన పీవీ సింధు


ఇండియన్ ఏస్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు మరో ఘనతను సాధించింది. తన కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్ ను కైవసం చేసుకుంది. ప్రపంచ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగబాకింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జుయింగ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. మూడో స్థానంలో ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతకు ముందు సింధు ఐదవ ర్యాంక్ లో ఉంది. మరో ఇండియన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 9వ స్థానంలో నిలబడింది. 2015లో సైనా నెహ్వాల్ టాప్ ర్యాంక్ ను సాధించిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News