: భవిష్యత్ లో న్యాయం చేస్తానని ధూళిపాళ్లకు చెప్పిన చంద్రబాబు!
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో నిరాశ చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు భవిష్యత్ లో న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు చంద్రబాబును ఈ రోజు నరేంద్ర కలిశారు. సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి వర్గంలో చోటు కల్పించలేకపోయామని నరేంద్రకు మరోమారు స్పష్టం చేశారు. కాగా, ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో పలువురు టీడీపీ నేతలు నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు. అయితే, కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ ను అభింనందించే నిమిత్తం నరేంద్ర ఇటీవల ఆయన్ని కలిశారు. సీఎం చంద్రబాబును కలవాలని ఆయనకు లోకేశ్ సూచించడం జరిగింది.