: శివసేన ఎఫెక్ట్.. మహారాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత పెంపు
మహారాష్ట్రలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలంటూ ఎయిరిండియా యాజమాన్యం కోరింది. ఎయిరిండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలన్నీ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ను తమ విమానాల్లో ఎక్కకుండా బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పార్లమెంటులో ఈ రోజు శివసేన ఎంపీలు గందరగోళం సృష్టించారు. ముంబై నుంచి ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో తామూ చూస్తామంటూ పార్లమెంటు సాక్షిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, ఎయిరిండియా అలర్ట్ అయింది. మహారాష్ట్రలోని విమానాశ్రయాల వద్ద భద్రతను పెంచాలని కోరింది. దీంతో, విమానాశ్రయాల వద్ద భద్రతను పెంచారు.