: కుప్పకూలిన నారాయణ కాలేజీ భవనం.. భవనం కిందే చిక్కుకుపోయిన ప్రొక్లెయిన‌ర్


రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విజ‌య‌వాడ‌లోని బంద‌రు రోడ్డులోని నారాయణ కాలేజీని తొలగిస్తోన్న సమయంలో ఒక్క‌సారిగా ఆ భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది. దీంతో భవనం కిందే ప్రొక్లెయిన‌ర్ చిక్కుకుపోయింది. దాని డ్రైవ‌ర్ కూడా అందులోనే ఉన్నాడు. స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టిన సిబ్బంది అత‌డిని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక్క‌సారిగా పెద్ద శ‌బ్దంతో భ‌వ‌నం కుప్ప‌కూలిపోవ‌డంతో స్థానికులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో ఆ భ‌వ‌నం ద‌గ్గ‌ర ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.  

  • Loading...

More Telugu News