: 'టీ' వాణిజ్య ప్రకటనలో తనపై లైంగిక వేధింపులను ప్రస్తావించిన హీరోయిన్ భావన!
కేరళలో కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్ భావన నటించిన ఓ టీ కంపెనీ యాడ్, ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ టీ కంపెనీ వ్యాపార ప్రకటనలో నటించిన ఆమె, "మహిళలు ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా దృఢంగా ఉండాలి" అని చెప్పడమే దీన్ని వైరల్ చేసింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను గుర్తు చేసేలా ఆమె మాట్లాడాల్సిన అవసరం ఏంటని పలువురు కామెంట్లు చేస్తుండగా, ఆమె అన్నీ మరచిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించిందని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా, తనను కిడ్నాప్ చేసిన వారికి శిక్షపడేలా చేస్తానని శపథం చేసిన ఆమె, తిరిగి నటనపై దృష్టిని సారించడం శుభపరిణామం.