: పాడైపోయిన చికెన్‌, ఈగలు వాలిన ఆహారపదార్థాలు.. బావర్చి హోటల్‌పై కేసు


పాడైపోయిన చికెన్‌, ఈగలు వాలిన ఆహారపదార్థాలను కస్టమర్లకు స‌ర్వ్ చేస్తోన్న ఎల్‌బీన‌గ‌ర్‌లోని ది న్యూ గ్రీన్‌ బావర్చి హోటల్‌పై ఈ రోజు అధికారులు కేసు న‌మోదు చేశారు. హోట‌ల్ యాజ‌మాన్యంపై రూ.10 వేల జ‌రిమానా కూడా విధించారు. కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లోని పలు హోట్లళ్లు, రెస్టారెంట్ల‌పై జీహెచ్‌ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు హోటళ్లపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించిన అధికారులు త‌మ దాడుల‌ను ఇంకా కొన‌సాగిస్తున్నారు. నాణ్య‌తలేని ఆహారం స‌ర్వీస్ చేస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యంతో ఆడుకునే హోట‌ళ్ల‌ను ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News